NATIONAL

బంగ్లాదేశ్ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తొంది-మంత్రి జయశంకర్

అఖిలపక్ష సమావేశంలో..

అమరావతి: పొరుగు దేశామైన బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు.. అక్కడ ఉన్న భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం పరిస్థితులపై కేంద్రం ఉదయం 10 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పార్టీల నేతలకు వివరించారు..అనంతరం బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మంగళవారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ ప్రకటన చేశారు.. బంగ్లాదేశ్‌లో, భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని వెల్లడించారు.. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో హింస చెలరేగిన అనంతరం సుమారు 8 వేల మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగి వచ్చినట్లు చెప్పారు..వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

బంగ్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌ చేరుకున్న అనంతరం హసీనాతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఈ సందర్భంగా జైశంకర్‌ తెలిపారు.. హసీనా భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించుకోవడానికి ప్రభుత్వం కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు..తొలుత జరిగిన అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, కిరణ్‌ రిజుజు, రామ్మోహన్‌ నాయుడుతోపాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు..బంగ్లాదేశ్‌లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *