లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ చేయవద్దు-కేంద్ర సమాచార శాఖ
అమరావతి: :ఇండియా మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5ని ఆదేశించింది. వ్యవస్థీకృత నేరాలను గ్లామరైజ్ చేసేలా ఉన్న ఈ కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా సిద్ధూ మూసేవాలా హత్య వంటి సున్నితమైన అంశాలు పంజాబ్‌లో అశాంతికి దారితీస్తాయని పోలీసులు, రాజకీయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ అనుమతి లేకుండా ఈ సిరీస్ నిర్మించారని లారెన్స్ బిష్ణోయ్ కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్‌ను నిషేధించాలని కోరుతూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ రాజా వారింగ్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఐటీ చట్టం సెక్షన్ 69A(1) కింద దీనిని నిలిపివేయాలని సైబర్ క్రైమ్ విభాగం కోరింది. ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన ఈ డాక్యుమెంటరీ హింసను ప్రేరేపించేలా ఉందని కేంద్రం అభిప్రాయపడింది.

