NATIONAL

గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ వాసులకు తీవ్ర ఇబ్బందులు

అమరావతి: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం దీపావ‌ళి పండుగ‌కు ముందే గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది..ఇందుకు తోడుగా పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహించింది..పర్యావసనం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  అధ్వానస్థితికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి  వెల్లడించింది..సోమవారం ఉదయం ఢిల్లీలో AQI 328 వద్ద నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.. ముఖ్యంగా ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో గాలి నాణ్యత సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఏక్యూఐ 357 గా నమోదు కావడంతో ఈ ప్రాంతంలో ప్రమాదకరమై పరిస్థితి ఎదురు అవుతొంది.. అక్షర్‌ధామ ఆలయం వద్ద 357గా గాలి నాణ్యత నమోదైనట్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తెలిపింది..నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు వెల్లడించింది.

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు..ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్లు, కాలుష్యం లేదని,, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని,,AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని,, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని,, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *