డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేసిన ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి
విచారణకు అదేశం..
నెల్లూరు: ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మిసంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేయడంతో పాటు మహిళా సర్పంచ్‍ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన సంఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు తన సంతకాలు ఫోర్జరీ చేసి దూషించారంటూ మహిళా సర్పంచ్ లక్ష్మి..ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో బుధవారం అసెంబ్లీ వద్దకు వెళ్లిన సర్పంచ్ లక్ష్మి,, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు..దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్,, గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులను నామ మాత్రం చేసిన వైసీపీ పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు..ఎన్డీయే పాలనలో కచ్చితంగా పంచాయతీలను బలోపేతం చేస్తామని అన్నారు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు మహిళా సర్పంచ్‌ను బెదిరించి, కుల దూషణ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బూదూరు లక్ష్మి తనకు ఫిర్యాదు చేసినట్లు పవన్ తెలిపారు.. సర్పంచ్ లక్ష్మి ఐదేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడిన విషయం ఆమె మాటల్లో తెలుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను మాజీ మంత్రితో కుమ్మక్కై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కులదూషణ చేసి వేధింపులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.. ఊరి నుంచి వెళ్లిపోవాలని బాధితురాలని బెదిరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఘటనపై విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తామని మహిళా సర్పంచ్‌కు హమీ ఇచ్చినట్లు వెల్లడించారు.