వి.ఆర్.సి గ్రౌండ్స్ లో పచ్చని చెట్లను అడ్డంగా నరికివేస్తున్నారు
నాయకులు స్పందిస్తారా??
నెల్లూరు: పచ్చని చెట్లను అడ్డంగా నరికివేస్తున్నారంటూ ప్రస్తుత అధికార ఎన్డీఏ పక్షం, గత మాజీ సీ.ఎం జగన్ పర్యటనలకు వెళ్లినప్పుడు వైసీపీ ప్రభుత్వంపైన విరుచుకుని పడేది.. నేడు ఏ నాయకుడు పర్యటనలకు వెళ్లకుండానే నగర నడిబొడ్డున వున్న వి.ఆర్.సి గ్రౌండ్స్ లో పచ్చని చెట్ల కొమ్మలను నిలువున నరికి వేస్తున్న పట్టించుకునే నాధుడే లేడు. వి.ఆర్.సి గ్రౌండ్స్ రోడ్డు వైపున గొడ ప్రక్కన వున్న “వేప చెట్లను“ కార్పొరేషన్ సిబ్బందా ? లేక గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికి వేస్తున్న అటు అధికారులు కాని ఇటు నాయకులు కాని స్పందించక పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వి.ఆర్.సి గ్రౌండ్ అంటేనే “ఆనాధ” అన్న చందగా మారిపోయింది. ఎన్నికల సమయంలో మాజీ సీ.ఎం జగన్,నెల్లూరు నగరంలో ప్రచారం నిర్వహించేందుకు హడవిడిగా నెల్లూరుకు రావడంతో, హెలికాప్టర్ దిగేందుకు పోలీసు పేరే గ్రౌండ్స్ ను కాకుండా, వి.ఆర్.సి గ్రౌండ్స్ లో ల్యాండింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు, అధికారులు. ఈ సందర్బంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు ఏ మాత్రం అనుకూలంగా లేని వి.ఆర్.సి గ్రౌండ్స్ ను ఎంచుకోవడమే పెద్ద తప్పు ? అదే సమయంలో వి.ఆర్.సి గ్రౌండ్స్ లో వున్న బాస్కెట్ బాల్ కోర్టులో వున్న కరెంట్ పోల్స్ ను అధికారులు నిలువున్న కట్ చేసి ప్రక్కన పెట్టేశారు. ఇదేమని అడిగే నాయకుడు లేడు ? స్థానికులు ప్రశ్నించిన సమాధానం చెప్పే అధికారి లేడు. వి.ఆర్.సి గ్రౌండ్ కేవలం క్రీడాలకే పరిమిత కావల్సి వుండగా మత పరమైన కార్యాక్రమాలకు ఉపయోగిస్తుండడంతో, గ్రౌండ్ లో క్రీడాల పోటీలు అనేవి క్రమేపి మాయం అయ్యాయి. ప్రస్తుత నగర ఎమ్మేల్యేగా వున్న పొంగూరు.నారాయణ,తక్షణం స్సందించి వి.ఆర్.సి గ్రౌండ్స్ ను చక్క దిద్దేందుకు నడుం బిగిస్తారా ? కరెంట్ పోల్స్ ను అడ్డంగా కొసివేసిన అధికారులు తిరిగి వాటిని యథాస్థానంలో నిలపెట్టే విధంగా చర్యలు తీసుకుంటారా ? వి.ఆర్.సి గ్రౌండ్స్ లో వాచ్ మెన్ నియమించే విధంగా నగర ఎమ్మేల్యే నారాయణ స్పందిస్తారా ? లేక ?…
క్రీడాల పట్ల అభిమానం వున్న ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రి ఆనం.రామనారాయణ రెడ్డి అయిన చొరవ తీసుకుని, వి.ఆర్.సి గ్రౌండ్స్ లోని పచ్చని చెట్లను నరికివేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అదేశిస్తారా ? అలాగే వి.ఆర్.సి గ్రౌండ్స్ కు క్రీడా వైభవం తీసుకుని వస్తారని నగర ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందొ వేచి చూదాం?…