DISTRICTS

అనధికార నిర్మాణం వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కమీషనర్

నెల్లూరు: నగరంలోని కనకమహాల్ సెంటర్  సి.ఎం.ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా చేపడుతున్న అనధికార నిర్మాణం వ్యవహారంలో సచివాలయ వార్డు ప్లానింగ్ & రెగ్యులరైజేషన్ కార్యదర్శి సి.హెచ్ శివకుమార్, టి.పి.బి.వో (ఇన్చార్జ్) కె. వెంకటేష్ లను సస్పెండ్ చేస్తూ నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. కనకమహాల్ సెంటర్ లో చేపడుతూన్న నిర్మాణంకు సంబంధించి వారిరువురికి షోకాజు నోటీసులు జారీ చేసినప్పటికి, వారి నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో,ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *