బ్లాక్ స్పాట్స్ ను పరిశుభ్రం చేసి గ్రీన్ స్పాట్స్ గా మార్చండి-కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేస్తున్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి, వాటిని పరిశుభ్రం చేసి గ్రీన్ స్పాట్స్ గా మార్చిన అనంతరం ఆయా ప్రాంతాల్లో వ్యర్ధాలు వేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని శానిటేషన్ విభాగం అధికారులు,
వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల క్రయవిక్రయాలను నిరంతరం పర్యవేక్షించి ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధించాలని సూచించారు. నగరవ్యాప్తంగా జరుగుతున్న డ్రైను కాలువల పూడికతీత పనులతో పాటు పూర్తిస్థాయిలో సిల్ట్ తొలగించే పనులను ఈనెల చివరి నాటికి పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. నగరం మొత్తం చిన్న, పెద్ద డ్రైను కాలువల్లో జరుగుతున్న డీసిల్టేషన్ పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు.సచివాలయం పరిధిలో వారంలో కనీసం ఐదు రోజులు తప్పనిసరిగా ఫాగింగ్ ప్రక్రియను, దోమల నివారణ పిచికారి మందులను స్ప్రేయింగ్ చేయించాలని ఆదేశించారు.