రాబోయే వేసవి కాలం మండే ఎండలు,వడగాల్పులు తీవ్రంగా వుండే అవకాశం-వాతావరణశాఖ
అమరావతి: రాబోయే వేసవి కాలం మండే ఎండల ప్రభావం,,వడగాల్పులతో తీవ్రంగా వుండే అవకాశం వుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ శనివారం తెలిపారు..మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ,, ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం చూపే అవకాశం వుందని హెచ్చరికలు జారీ చేశారు..మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుందని చెప్పారు.. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు..గర్బిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,,ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు..