54 డివిజన్లో నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి నారాయణ
నెల్లూరు: నగర పరిధిలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో నిర్వాసితులకు మంత్రి నారాయణ ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. గత ఏడాది పెన్నా తీర ప్రాంతం వెంకటేశ్వరపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం పలువురి ఇళ్లను తొలగించారు. వారికి ఇళ్ల స్థలాలను అందిస్తానని హామీ ఇచ్చిన మంత్రి నారాయణ ఆదివారం 126 మంది నిర్వాసితులైన లబ్ధిదారులకు రెండు సెంట్లు (సుమారు12 అంకణాలు) స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పట్టా కాగితాలను ఆదివారం పంపిణీ చేశారు.అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ పాఠశాలకు ప్రహరీ గోడ లేదని అలాగే ఆట స్థలం ఉన్న పిల్లలు ఆడుకునే వస్తువులు లేకపోవడానికి గమనించామన్నారు. వెంటనే అధికారులను సంప్రదించి ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన చేశామని తెలిపారు అలాగే ప్రహరీ గోడ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలిచి ఆ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు పాఠశాలలో చిన్నచిన్న మరమ్మత్తులు చేయించేందుకు అధికారాలతో మాట్లాడటం జరిగిందన్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు వైసిపి ప్రభుత్వం అప్పట్లో అనేకమందికి పట్టా కాయితాలు ఇచ్చిందని, అయితే ఆయా స్థలాలు వారికి మంజూరు కాలేదని కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయని మంత్రి వివరించారు. ఇచ్చిన పట్టా కాయితాలు పరిశీలించామని అవి పట్టా కాగితాలు కాదని తేలిందన్నారు. వైసిపి ప్రభుత్వం పట్టా కాయితాల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు.