AP&TGDEVOTIONALOTHERS

వేసవిలో ఇబ్బంది లేకుండా తిరుమలలో నిండిన జలాశయాలు

తిరుపతి: తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు శ్రీవారి దర్శనకు వచ్చే భక్తులకు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది.

నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి:-

1) పాపవినాశనం డ్యామ్:- 693.27 మీ. కాగా FRL: – 697.14 మీ…2) గోగర్భం డ్యామ్:- 2894 అడుగులు, FRL: – 2894 అడుగులు…3) ఆకాశగంగ డ్యామ్:- 855.00 మీ,,FRL: – 865.00 మీ… 4) కుమారధార డ్యామ్:- 890.80 మీ,,FRL: – 898.24మీ,,5) పసుపుధార డ్యామ్:- 896.35మీ,,FRL: – 898.24మీ చేరుకున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *