పుష్పా హీరో ఆల్లు.ఆర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదాబాద్: హైదాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని డిసెంబర్ 4న రాత్రి సంధ్య థియేటర్‌లో Pushpa 2 The Rule బెనిఫిట్ షో నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలైన విషయం పాఠకులకు విదితమే..ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే నమోదు చేశారు.. ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి,, చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు..ఈ సంఘటనలో పోలీసులు ఇటీవలే సెక్యూరిటీగార్డ్‌తో సహా సంధ్య థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. అల్లు అర్జున్‌పై BNS 118 (1), BNS 105, Red with 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి..105 సెక్షన్ (నాన్ బెయిలబుల్ కేసు) కింద 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం వుంటుంది..సినిమా హాలు వద్ద జరిగిన సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్,,బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు..అలాగే ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు.