“పనిచేయడం నేర్చుకోవడానికి సిద్దంగా వున్నాను” డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అప్పుడు,ఇప్పుడు వున్నది మీరే…
అమరావతి: అప్పుడున్నది మీరే… ఇప్పుడున్నది మీరే… అదే రాజ్యాంగం కానీ అప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు పడరు… ఇప్పుడున్నది అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు పాలనలో “పనిచేయడాని నేర్చుకోవడానికి సిద్దంగా వున్నాను” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు..సోమవారం అమరావతి జరిగిన కలెక్టర్ల సదస్సులో అయన తొలుత మాట్లాడారు..అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి, మొదటి కలెక్టర్స్ మీటింగ్ లోనే, ప్రజావేదిక విధ్వంసం చేస్తున్నా అని చెప్పి, ఆ మీటింగ్ నుంచే విధ్వంసం మొదలు పెట్టాడన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, అధికారులని కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి చూశామని,, చరిత్రలో చేతకాని పాలనలు, అవినీతి పాలనలు చూసాం కానీ, మొదటి సారి ఒక విధ్వంసం చేసే ప్రభుత్వం పాలనను 2019-2024 మధ్య కాలంలో చూశామని అన్నారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికల అయిన నేతలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని అయితే వాటిని ఆమలు చేసి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేదే జిల్లా స్థాయిలో కలెక్టర్లు అని అన్నారు..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలాంటి భేషజాలకు లేకుండా తను పని చేయడం నేర్చుకోవాడానికి సిద్దంగా వున్నాను అనే మాట, మన అందరికి కూడా వర్తిస్తుందని సీ.ఎం చంద్రబాబు అన్నారు.