క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై విజయం సాధించిన భారత్ హాకీ జట్టు
అమరావతి: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు పతకాన్ని అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలోకి చేరుకుంది..అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై సంచలనాత్మక విజయాన్ని సాధించి సెమీస్ బెర్త్ కు చేరింది.. మ్యాచ్ ఫుల్-టైమ్‌లో ఇరు జట్లు 1-1 స్కోరుతో సమానంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది..దీంతో షూటౌట్‌లో 4-2 ఆధిక్యంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది..ఆట రెండవ అర్ధ భాగంలో అమిత్ రోహిదాస్ రెడ్ కార్డ్ కు గురవ్వడంతో భారత జట్టు 10 మంది ప్లేయర్లతో తలపడాల్సి వచ్చింది.. ఒక ఆటగాడు తక్కువగా ఉన్నప్పటికీ భారత ఆటగాళ్లు ఏమాత్రం నిరుత్సహ పడలేదు..అద్భుతం ఆడి బ్రిటన్‌కు చమటలు పట్టించారు..ఆట 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ బంతిని పోస్టు లో పంపించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు..ఆట మూడవ భాగంలో గోల్ సాధించేందుకు బ్రిటన్ ఆటగాళ్లు అటాక్ గేమ్ ను అడారు..అయితే భారత దిగ్గజ ఆటగాడు పీఆర్ శ్రీజేష్ ప్రత్యర్థి ఆటగాళ్ల ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ, గోల్ పోస్టు ముందు అడ్డుగోడలా నిలిచారు..ఆట కొన్ని నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ గ్రేట్ గోల్ సాధించాడు.. దీంతో ఇరు జట్ల స్కోర్లు 1-1తో సమం అయింది.. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది..ఇక మిగిలింది సెమీ ఫైనల్స్..?