ప్రధాని మోదీని ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన చంద్రబాబు
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఆగష్టు 1వ తేదిన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు సమాచారం.దాదాపు 30 నిమిషాలకు పైగా చంద్రబాబు, ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు సమాచారం. బుధవారం గన్నవరం నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడులు ప్రధానిని కలిశారు.

