AP&TGMOVIESNATIONAL

నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

అమరావతి: ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారనే కేసులోనే నటుడు ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరు 48వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 2019లో దిలీప్ కుమార్ అనే లాయర్, ప్రకాష్‌రాజ్‌కు, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు ఉందని బెంగళూరులోని హలసూరు గేటు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయిన  ప్రకాశ్ రాజ్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సదరు న్యాయవాది కోర్టుని ఆశ్రయించగా, విచారణకు హాజరు కావాలంటూ బెంగళూరు కోర్టు పలుసార్లు సమన్లు జారీ చేసిన,కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాష్‌రాజ్ విచారణలకు గైర్హాజరవుతూ కావడంతో.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *