AP&TGNATIONAL

26వ తేదిన తుఫానుగా,27న అత్యంత భారీ వర్షాలు-ఐఎండీ

అమరావతి: తూర్పు-మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అక్టోబర్ 24న ‘డిప్రెషన్’గా, అక్టోబర్ 25న ‘డీప్ డిప్రెషన్’గా బలపడే అవకాశం ఉందని భారతవాతావరణశాఖ తెలిపింది.ఆ తర్వాత, అక్టోబర్ 26వ తేది ఉదయానికి ఇది పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ‘తుపాను’ గా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

వర్షపాత హెచ్చరికలు….

అత్యంత భారీ వర్షాలు:– అక్టోబర్ 27 మరియు 28 తేదీలలో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో, అక్టోబర్ 28న ఒడిశాలో కురిసే అవకాశం ఉంది.

భారీ నుండి అతి భారీ వర్షాలు:– అక్టోబర్ 27 మరియు 29 తేదీలలో ఒడిశాలో కురిసే అవకాశం ఉంది.

ఈ వాతావరణ వ్యవస్థ రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఉత్తర ఆంధ్రప్రదేశ్,దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వైపు పయనించే అవకాశం ఉంది. ప్రజులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *