స్వేఛ్చవాయువులను పీల్చుకున్న క్షణమే నేటి 79వ స్వాతంత్ర్య దినోత్సవం-ప్రధాని మోదీ
అమరావతి: భారతీయులు బానిస సంకెళ్లను తెంచుకుని స్వేఛ్చవాయువులను పీల్చుకున్న క్షణమే నేటి 79వ స్వాతంత్ర్య దినోత్సవం అని,,నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం కోట్లాది మంది త్యాగాలతో సాధించుకున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 12వ సారి జాతీయజెండా ఎగురవేశారు..అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ న్యూక్లియర్ బాంబు బెదిరింపులకు భారత్ తలవంచే రోజులు పోయాయన్నారు.. ఆపరేషన్ సింధూర్‌తో మన దేశ సత్తా చాటామని చెప్పారు.. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు చేశారు.
ఇక నుంచి భారత్ ఎవరి బ్లాక్ మెయిల్ ను సహించదు.. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవని మళ్లీ చెబుతున్నా.. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం..బ్లాక్ మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం..ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. అలాంటి బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పాం.. సింధూ నది జలాలపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి.. ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు.. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం.. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు.. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు.. దీనిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు..
భార్య ముందే భర్తలను చంపేశారు:- “ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు.. పహల్గాంలో మతం పేరుతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు.. భార్య ముందే భర్తలను చంపేశారు..పిల్లల ముందే తండ్రిని చంపేశారు.. మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు..ఈ సంఘటనతో యావత్ దేశం ఆగ్రహంతో రగిపోయింది.. మన సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.. ఆపరేషన్ సిందూర్‌తో మన దేశ సత్తా చాటాం.. మన సైనికులు,,శత్రువుల ఊహకందని విధంగా దెబ్బతీశారు.. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేఛ్చ త్రివిధ దళాలకే ఇచ్చాం.. ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించిన హీరోలకు నా సెల్యూట్..ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాం అన్నారు”..
యువతకు దీపావళి కానుక:- ఈసారి డబుల్ దీపావళి వేడుకలని ప్రధాని మోదీ అన్నారు.. సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.. హైపవర్ కమిటీ ఏర్పాటుతో GST సంస్కరణలు తెస్తామని,, దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు.. మనం సృష్టించిన UPI ప్రపంచంలో మనశక్తిని చాటుతోందన్నారు.. భారతదేశ సంపద బయటకు ఎందుకెళ్లాలని,, ప్రతిరంగంలో మనమే అప్లికేషన్లు తయారుచేసుకుందాం అని పిలుపునిచ్చారు.. ప్రపంచానికి ఫార్మా కేపిటల్‌గా భారత్‌కు పేరుందన్నారు.. వ్యాక్సిన్ల తయారీలోనూ మనం సత్తా చాటేమని గుర్తు చేశారు..ప్రస్తుతం ఐటీ యుగం నడుస్తొందని,,ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి AI వరకు అన్నీ మనవే కావాలని ప్రధాని మోదీ అన్నారు.