కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హెకోర్టులో ఎదురు దెబ్బ
అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న ఏ రాష్ట్రంలో అయిన ఉన్నత స్థాయి నాయకులు,,బినామీలకు భూ సంతర్పణలు,, వారి కుటుంబ సభ్యులపై కోట్ల రూపాయల విలువ చేసే భూమూలను రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం షారా మాములే.. ఈలాంటి వ్యవహారంలో…. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది..సీఎం కుటుంబానికి మంగళూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-MUDA స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించింది..స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉందని స్పష్టం చేసింది..ముఖ్యమంత్రిపై విచారణకు అదేశించే అధికారం గవర్నర్‌కు లేదంటూ,,గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ,సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టేసింది..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది.. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది..ఈ సంతర్పణ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక (నోటి మాటతో) ఆదేశాలతోనే అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని ప్రతిపక్ష భాజపా, జేడీఎస్ ఆరోపించాయి..ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు..ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని గవర్నర్ తొలుత ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు..అటు తరువాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతి మంజూరు చేశారు.