NATIONALOTHERSWORLD

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్టాత్మక ‘గ్రామీ’ అవార్డు

అమరావతి: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్టాత్మక ‘గ్రామీ’ అవార్డును ప్రకటించడంపై చైనా తీవ్రంగా ఖండించింది. ఈ గుర్తింపును ఉపయోగించుకుని ఆయన చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీజింగ్ పేర్కొంది.

“మెడిటేషన్” అనే ఆల్బమ్‌కు గాను బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో దలైలామా ‘గ్రామీ’ అవార్డును గెలుచుకున్నారు.కాలిఫోర్నియా వేదికగా ఆదివారం జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డుల్లో దలైలామాకు ఈ అవార్డును ప్రకటించారు.90 ఏళ్ల వయస్సులో ఆయనను గ్రామీ అవార్డు వరించడంపై అందరు అయనను అభినందిస్తూన్నారు.

దలైలామా 1959లో టిబెట్‌ను విడిచిపెట్టి ధర్మశాలలో ప్రవాసజీవితం గడుపుతున్నారు. టిబెట్ విముక్తి కోసం అహింసాయుత పద్ధతిలో పోరాటం సాగిస్తున్నందుకు 1989లో ఆయనను నోబెల్ శాంతి బహుమతి వరించింది.నడు గ్రామీ అవార్డు రావడంపై దలైలామా స్పందించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా చూడటం లేదని, శాంతి, కరుణ, పర్యావరణంపై శ్రద్ధ, మానవత్వం వంటివి 800 కోట్ల ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు దోహదం చేస్తాయని, గ్రామీ గుర్తింపు ఈ సందేశాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడంలో సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *