ముంబైలో టెస్లా షో రూమ్ ప్రారంభం
అమరావతి: ప్రపంచ బ్యాటరీ కార్ల దిగ్గజ కంపెనీ అయిన టెస్లా, భారతదేశ మార్కెట్స్ లోకి మంగళవారం ఉదయం అడుగు పెట్టింది..ముంబై,,బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో తొలి షోరూంను ప్రారంభించింది..ఈ కార్యక్రమనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా టెస్లా తొలి షోరూం ముంబైలో ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు.. టెస్లా తయారీ,, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను కూడా ముంబైలో ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు ఫడ్నణవీస్ ఈ సందర్భంగా అన్నారు..తొలిషోరూంలో ప్రదర్శన కోసం టెస్లా సంస్థ Y మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలోని వారి ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చింది.. డిమాండ్‌ను పట్టి ఆ తరువాత ఢిల్లీలోనూ షో రూం ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని సంబంధిత సంస్థ అధికారులు తెలిపారు.