హిమాచల్ ప్రదేశ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్-వరదల్లో కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు
అమరావతి: హిమాచల్ ప్రదేశ్ లో శుక్రవారం అర్ధరాత్రి సిమ్లా జిల్లాలోని రాంపూర్ సబ్‌డివిజన్‌లోని తక్లోచ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది..భారీ వర్షం కారణంగా రోడ్లు, వంతెనలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి..ఈ విపత్తులో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి వార్తలు రాలేదు..విపత్తు సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు..వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 58 రహదారులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు..ఇందులో సిమ్లాలో 19 రోడ్లు,,మండిలో 14,,కాంగ్రాలో 12,, కులులో 8,, కిన్నౌర్‌లో 3,, సిర్మౌర్, లాహౌల్ స్పితి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 22వ తేది వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..12 జిల్లాల్లోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, చంబా, కాంగ్రా, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు శనివారం వరకూ తక్కువ స్థాయిలో వరద ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది..