కర్తవ్య భవన్ 3ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
అమరావతి: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ 3ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు..కేంద్ర ప్రభుత్వ కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలన్నింటినీ ఒక చోట చేర్చే ‘కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్’లో “కర్తవ్య భవన్ 3” మొదటిది.. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్ లోకి మార్చారు.. కర్తవ్యభవన్లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు..6 ఆంతస్థుల ఈ భవనంలో 1.5 లక్షల చదరపు మీటర్లు అందుబాటులో ఉంది.. భవన్లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు..ఇక్కడ నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, MSME మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు పనిచేస్తాయి..
పనిసామర్థ్యం, సమన్వయం:- ఢిల్లీలో వేర్వేరు చోట్ల ఉన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పనిసామర్థ్యం, సమన్వయం పెరుగుతుందని కేంద్రం భావిస్తొంది..ప్రస్తుతం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యాలయాలు పాతపడిన శాస్త్రి భవన్, క్రిషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్లలో పనిచేస్తుస్తున్నాయి..ఈ భవంతులు 1950-1970 మధ్య నిర్మించారు.. ఇవి నిర్మాణపరంగా కాలం చెల్లినవిగా ప్రభుత్వం భావిస్తోంది.. వీటిలో 2-3 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి.. అవి వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశాలున్నాయి.. వచ్చే 2026 ఏప్రిల్ నాటికి 10 సీసీఎస్ భవనాల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది.

