బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
అమరావతి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఏక్రగీవ్రంగా ఎన్నికైయ్యారు.. ఆదివారం ముంబైలోని BCCI కార్యాలయంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస్‌ను BCCI అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.,రాజీవ్ శుక్లాను ఉపాధ్యక్షుడిగా దేవజిత్ సైకియా గౌరవ కార్యదర్శిగా,, ప్రభుతేజ్ సింగ్ భాటియా జాయింట్ సెక్రెటరీగా,,కోశాధికారిగా రఘురామ్ భట్‌లను ప్రకటించారు.. ఇటీవల 70వ ఏట అడుగుపెట్టిన రోజర్ బిన్నీ BCCI అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు,. ఆయన స్థానంలో 45 ఏళ్ల మిథన్ మన్హాస్ BCCI నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానున్నారు.. మిథన్ మన్హాస్ నియామకంతో జమ్ముకశ్మీర్‌లో పుట్టి BCCI అధ్యక్షుడిగా ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు., ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న మిథున్ మన్హాస్,, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.