NATIONALOTHERSTECHNOLOGY

డిశంబరు నాటికి వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు-కేంద్ర మంత్రి ఆశ్విని

అమరావతి: దేశంలో త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.. అదివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగళూరులోని ప్రొడక్షన్ యూనిట్‌ని సందర్శించి, అక్కడ తయారు అవుతున్న వందే భారత్ స్లీపర్ రైలును పరిశీలించారు..అనంతరం BEML ఫెసిలిటీ సెంటర్ లో వందే భారత్ స్లీపర్ కోచ్‌కు సంబంధించిన ప్రోటోటైప్ వెర్షన్‌ను ఆవిష్కరించారు..ఈ సందర్బంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ వందే భారత్ స్లీపర్ రైలు డిజైన్,బోగీలోని లోపలి భాగం చాలా ఆకర్షణీయంగా ఉందని, అందులో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ప్రయాణీకులకు అందించబడుతున్నాయని తెలిపారు..వందే భారత్ స్లీపర్ రైళ్లలో, సౌకర్యం, భద్రత, సామర్థ్యం పరంగా కొత్త ప్రమాణాలను అందుకోనున్నదని తెలిపారు..ఈ రైలులో USB ఛార్జింగ్, పబ్లిక్ ప్రకటనలు, టీవీలు,ఇన్‌సైడ్ డిస్ప్లే ప్యానెల్లు, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీతోపాటు ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్లు ఉన్నాయన్నారు..వికలాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్‌ లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారని,,1st AC కంపార్ట్‌ మెంట్‌లో ప్రయాణికులకు హాట్ వాటర్ షవర్ సౌకర్యం కూడా అందించబడుతుందన్నారు.

రాజధాని ఛార్జీలు:- వందేభారత్ రైలు డిజైన్‌ను మెరుగుపరుస్తున్నామని,,ప్రయాణికులు సూచనలు,,తమ అనుభవాల నుంచి నేర్చుకుని విషయాలను దృష్టిలో వుంచుకుని సౌకర్యలను మరింత మెరుగుపరుస్తున్నామని కేంద్ర మంత్రి ఆశ్విని తెలిపారు..16 కోచ్‌లతో వున్న వందే భారత్ స్లీపర్ రైలు 800 నుంచి 1200 కి.మీ దూరం వరకు ప్రయాణిస్తుందన్నారు..ఈ రైలులో ఆక్సిజన్ స్థాయిలు, వైరస్ రక్షణ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయన్నారు..ఈ రైలు మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దీని ఛార్జీలు రాజధాని ఎక్స్‌ ప్రెస్‌తో సమానంగా ఉంటాయన్నారు.. తదుపరి పరీక్షల కోసం ఈ రైలు ట్రాక్‌లోకి తీసుకెళ్లడానికి ముందు 10 రోజుల్లో ఫిట్ నెస్ టెస్ట్ లు జరగాల్సి వుందన్నారు..రాబోయేమూడు నెలల్లో ఈ రైలు ప్రయాణం  ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *