వినాయక నిమజ్జనంపై బెదిరింపు మేసేజ్ పంపిన వ్యక్తి అరెస్ట్
అమరావతి: వినాయక నిమజ్జనం సందర్బంగా ముంబైలో ఉగ్ర బెదిరింపులు కలకలం రేపిన విషయం తెలిసిందే. ముంబై నగరమంతా మానవ బాంబులను మోహరించామని,,400 కిలోల ఆర్డీఎక్స్ తో కోటి మందిని చంపేస్తారంటూ వచ్చిన బెదిరింపు సందేశంపై అప్రమత్తం అయిన ముంబై పోలీస్ కట్టు దిట్టమైన బందొబస్తు చేపట్టారు.. వెంటనే దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు,,యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, ఇతర దర్యాప్తు సంఘాలు కూడా రంగంలోకి దిగాయి..
దర్యాప్తులో బాగంగా అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు..నిందితుడు బీహార్‌లోని పాటలీపుత్రకు చెందిన అశ్వినీ కుమార్‌గా గుర్తించారు..అతడిని నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు.. తన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.. ఫిరోజ్ అనే వ్యక్తి తనపై 2023లో కేసు పెట్టాడని,, దీంతో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు నిందితుడు తెలిపాడు..అతనిపై కక్ష్య పెంచుకున్న ఇతను ఇందుకు ప్రతీకారంగానే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పాడు..నిందితుడి వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్స్,,3 సిమ్ కార్డ్స్ తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.