DEVOTIONALNATIONALOTHERS

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం 

365 రోజుల్లో 450పై ఉత్సవాలు..

తిరుపతి: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ”స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌”అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించబడుతాయి.. కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ విశ్వాసం.. భక్తజనప్రియుడు, ఆశ్రితకల్పతరువు, కోరిన వరాలిచ్చే కోనేటిరాయుడైన శ్రీ వేంకటేశుడు వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే..నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధిగాంచిన వేంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన వంటి నిత్యోత్సవాలు, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిలాళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజూ ఒక పండుగగా, ప్రతిపూటా పరమాన్నభరిత నివేదనలతో,  ఏడు కొండలవాడు ఏడాది పొడవునా పూజలందుకుంటూ ఉత్సవాల దేవునిగా భక్తులు  ఆరాధిస్తున్నారు..సంవత్సరానికి 365 రోజులు అయితే కొండలరాయునికి ఉత్సవాలు 450కి పైగా జరుగుతాయంటే అతిశయోక్తిలేదు. అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప వేయికన్నులైనా చాలవు.. స్వామివారి ఉత్సవమూర్తియైన శ్రీ మలయప్ప తన ఉభయదేవేరులైన శ్రీభూదేవీలతో కూడి సర్వాంగసుందరంగా అలంకృతుడై తిరు ఉత్సవాలలో పాల్గొంటూ తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *