CRIMENATIONAL

స్వ‌ర్ణ దేవాలయాన్ని పేల్చివేస్తామంటూ ఈమెయిల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్

అమరావతి: పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో ఉన్న స్వ‌ర్ణ దేవాలయాన్ని పేల్చివేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్స్ పంపిన శుభం డూబేగా గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేశారు.. ఫరిదాబాద్‌ కు చెందిన ఇత‌ను సాప్ట్ వేర్ నిరుద్యొగి.. పోలీసు క‌మీష‌న‌ర్ గురుప్రీత్ సింగ్ బుల్లార్ దీనిపై ప్ర‌క‌ట‌న చేస్తూ,,ఈ కేసులో పాక్షికంగా పురొగతి సాధించిన‌ట్లు  చెప్పారు..నిందితుడిని ప్ర‌శ్నించే నిమిత్తం క‌స్ట‌డీలోకి తీసుకున్నట్లు క‌మీష‌న్ వెల్ల‌డించారు..డూబేకు చెందిన ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్ల‌ను సీజ్ చేసి,, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు.. జూలై 14వ తేదీ నుంచి శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంద‌క్ క‌మిటీకి,, గోల్డెన్ టెంపుల్‌ను పేల్చివేస్తామ‌ని 6 సార్లు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి.. ఈ కేసు విచార‌ణ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు(NIA) కూడా భాగ‌స్వామ్య‌మైన‌ట్లు బుల్లార్ తెలిపారు.. కొన్ని సాఫ్ట్‌ వేర్ కంపెనీల‌తో అనుమానితుడికి లింకు ఉన్న‌ట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *