NATIONAL

ఎన్డీయే ప్రభుత్వం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించింది.. జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది..ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదిన  జరుగనున్నది..ఆగష్టు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.. ఎన్డీఏ పార్టీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారంనాడు సమావేశమైంది.. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా తదితర పార్టీ అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నేపధ్యం…..

సీపీ రాధాకృష్ణన్‌ రాజకీయ నాయకుడు..రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీ రాధాకృష్ణన్‌ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యారు..

తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్ & పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను అదనపు బాధ్యతలును అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ గవర్నరుగా 2024 జులై 31 వరకు (అదనపు బాధ్యత), పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా 2024 ఆగస్టు 06 వరకు పనిచేసారు.

సీపీ రాధాకృష్ణన్ను 2024 జూలై 27న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర గవర్నర్గా నియమించగా, జూలై 27న గవర్నర్గా ప్రమాణస్వీకారం చేశాడు..

 రాజకీయ జీవితం:-  సీపీ రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్సభసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన ఆ తరువాత 1999లో రెండోసారి ఎంపికై 2004, 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్ గా పని చేశారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *