NATIONAL

సుప్రీమ్ కొర్టు 52వ భార‌త సీజెఐ ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి

అమరావతి: సుప్రీమ్ 52వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి బుధవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు..రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానమంత్రి నరేంద్రమోదీ,, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌,, మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌కోవింద్ పాల్గోన్నారు..జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తరువాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండవ దళిత న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ కావడం విశేషం..మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తిలో 1960,,న‌వంబ‌ర్ 24వ తేదీన ఆయ‌న జ‌న్మించారు.. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి తండ్రి ఆర్ఎస్ గ‌వాయి,,రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్ర‌ముఖ నేత‌..ఈయన బీహార్‌,,సిక్కిం,, కేర‌ళ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా పనిచేశారు..మంగళవారం సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీ విరమణ చేశారు..2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్‌ గవాయ్‌ 2025 నవంబర్‌ 23న పదవీ విరమణ చేస్తారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *