జైనుల ఆధ్యాత్మిక కార్యక్రమం రూ.1.5 కోట్ల విలువ చేసే బంగారు కలశలు చోరీ
అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోటలోని పార్క్, గేట్ నంబర్ 15 దగ్గర భారీ దొంగతనం జరిగింది..3వ తేది ఉదయం ఓ జైనుల ఆధ్యాత్మిక కార్యక్రమం అక్కడ జరిగింది..ఈ కార్యక్రమంలో రూ.కోటి విలువైన రెండు బంగారు కలశాలు చోరీకి గురయ్యాయని శనివారం ఫిర్యాదు రావడం జరిగిందని డిల్లీ అధికారులు వెల్లడించారు. ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ తీసుకొచ్చిన బంగారు కలశాలు కనిపించకుండా పోయాయి.పూజ కోసం తాను తీసుకువచ్చిన 760 గ్రాములు బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం పూజ అనంతరం కనిపించలేదని సుధీర్ జైన్ ఫిర్యాదుచేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవ్వడంతో తాము పక్కకు వెళ్లామని, అంతలోనే ఈ దొంగతనం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జైన్ సన్యాసి వస్త్రధరణలో:- ఎర్రకోట నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజసామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి, రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. చోరీ అనంతరం అతడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి జైన్ సన్యాసి వస్త్రధరణలో వుండడంతో అక్కడ ఎవరికి అనుమానం కలుగలేదు.