NATIONAL

క్రైస్తవురాలిగా బాప్టిజం తీసుకుని,,హిందువును అని చెప్పుకుంటే కుదరదు-సుప్రీమ్

మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ కోసం..

అమరావతి: మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. క్రైస్తవ మతానికి చెందిన మహిళకు షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఉద్యోగాల్లో కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు అనుమతించదని జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్​ స్పష్టం చేసింది..ఇలాంటి విధానలు అవలంభించడం, రిజర్వేషన్ కోటా విధానం ప్రాథమిక,,సామాజిక లక్ష్యాలను బలహీనపరిచినట్లే అవుతుందని పేర్కొంది..బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల విధానాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని,,అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని అభిప్రాయపడింది..

రిజర్వేషన్ ప్రయోజనాల కోసం:- హిందూ తండ్రికి,, క్రైస్తవ తల్లికి పుట్టిన సెల్వరాణి అనే ఓ మహిళ క్రైస్తవురాలిగా బాప్టిజం తీసుకుంది..ఆటు తరువాత తాను హిందువుగా ప్రకటించుకుని,,2015లో పుదుచ్చేరిలోని అప్పర్​ డివిజన్ కర్ల్క్ పోస్ట్​కు దరఖాస్తు చేసుకునేందుకు SC సర్టిఫికెట్​ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది..తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని, అందుకే SC సర్టిఫికెట్ కావాలని కోరింది.. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు కులధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించి..దీనిపై సెల్వరాణి సుప్రీం కోర్టులో సవాల్ చేయగా హైకోర్టును తీర్పును సమర్థించింది.. పిటిషనర్​ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే ఉన్నారని,, ఆమె తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. పిటిషనర్ తండ్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అయిన తరువాత క్రిస్టియన్​గా మతం మార్పినట్లు డాక్యుమెంటరీ ఆధారాల ద్వారా స్పష్టమైనట్లు న్యాయస్థానం వెల్లడించింది..పిటిషన్​రకు వ్యతిరేకంగానే సాక్ష్యాలు ఉన్నాయని,, కేవలం రిజర్వేషన్​ ప్రయోజనాల కోసమే మత మార్పిడి చేసుకున్నట్లుగా అర్థమవుతుందని తెలిపింది..అందుకే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు అనుమతించమని సుప్రీం కోర్టు తీర్పులో విస్పష్టంగా పేర్కొంది.

కేసు వివరాలు:- సి.సెల్వరాణి వర్సెస్ ది స్పెషల్ సెక్రటరీ- కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇతరులు- Citation : 2024 LiveLaw (SC) 923- www.livelaw.in

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *