NATIONAL

మితిమిరీన వేగంతో వాహానాలు నడిపితే బీమా సొమ్ము రాదు-సుప్రీంకోర్టు

అమరావతి: ప్రమాద బీమా వుంది కదా అని నిర్లక్ష్యంగా,,మితిమిరీన వేగంతో వాహానాలు నడిపి ప్రాణాలు కొల్పోతే,,సదరు భీమా సంస్థలు మరణించిన వ్యక్తి తాలుక భీమా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.. 2014 జూన్ 18వ తేదిన కర్ణాటకలోని మల్లసంద్ర గ్రామానికి చెందిన S.N రవీష్ తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో మలనహళ్లి సమీపంలో అతివేగం కారణంగా కారు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది..ఈ ప్రమాదంలో రవీష్ అక్కడికక్కడే మరణించాడు..రవీష్ భార్య,కొడుకు,తల్లిదండ్రులు కలిసి రూ.80 లక్షల బీమా పరిహారం కోరారు.. పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌ షీటులో అతను నిర్లక్ష్యంగా,అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.. దీనిపై మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కూడా కుటుంబానికి పరిహారం ఇవ్వడానికి నిరాకరించింది..దింతో వారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు..టైరు పేలినందువల్లే ప్రమాదం జరిగిందని హైకోర్టులో తమ వాదనలు వినిపించారు..కానీ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉండడంతో వారి వాదనలను కోర్టు తిరస్కరించింది..ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరుకుంది..జస్టిస్ పిఎస్ నరసింహ,,జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి,, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు బీమా డబ్బులు రావని తెలిపింది..బీమా చేసినా కూడా జరిగిన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అయితే సదరు కంపెనీలు బీమా డబ్బులు చెల్లించనక్కర్లేదని కోర్టు స్పష్టం చేసింది..వాహనం నడిపేటప్పుడు బాధ్యతతో వ్యవహరించకపోతే,,ప్రమాదాలే కాకుండా బీమా ప్రయోజనాలూ కోల్పోవాల్సి వస్తుందని వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *