CRIMEDISTRICTS

పీడీఎస్ సరుకులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు-జాయింట్ కలెక్టర్  మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరు: పేద ప్రజలకు అందాల్సిన పీడీఎస్ సరుకులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జాయింట్ కలెక్టర్  మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం జె.సి ప్రకటన విడుదల చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మనుబోలు మండలం, కాగితాలపురం బైపాస్ వద్ద ఉన్న Indian Oil Corporation Limited (IOCL) శక్తి ఫిల్లింగ్ స్టేషన్‌లో సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త బృందం వాహనాలను తనిఖీల సందర్భంగా AP 26 TL 6359 నంబరు గల లారీ ఒక మూలలో నిలిపి ఉంచబడినట్లు గుర్తించడం జరిగింది. వారు ఆ వాహనాన్ని పరిశీలించగా, అందులో 700 సంచుల్లో 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి ఉన్నట్లు బయటపడిందన్నారు. స్వాధీనం చేసిన బియ్యం విలువ రూ.14,70,000లు కాగా, లారీ విలువ రూ.8,00,000లు  మొత్తం రూ.22,70,000లు విలువైన సొత్తును పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

స్వాధీనం చేసిన పీడీఎస్ బియ్యాన్ని పొదలకూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో,  లారీని మనుబోలు పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మనుబోలు పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్ 318(4) మరియు Essential Commodities Act, 1955 సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఒగిరెడ్డి సుధాకర్ రెడ్డి, పీడీఎస్ బియ్యం మిడియేటర్, నిమ్మరెడ్డిపాలెం, సమంతపూడి, ప్రకాశం జిల్లా. అంబటి సురేష్, లారీ యజమాని-కమ్-డ్రైవర్ ఈ కేసులో నిందితులు అన్నారు. ఈ తనిఖీలో  సి. లక్ష్మీనారాయణ రెడ్డి, ASO, . ఎం.ఎస్. రాకేష్ యాదవ్, SHO, మనుబోలు. ఐ. రవి, CSDT, .డి. గుణశేఖర్, వీఆర్‌ఓ (i/c) పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *