DISTRICTS

డంపింగ్ యార్డ్ తొలగింపుకు రూ.23.88 కోట్లు-మంత్రి నారాయణ

రోడ్లను శుభ్రపరిచేందుకు 72 స్వీపింగ్ యంత్రాలు..

నెల్లూరు: అల్లిపురం (9వ డివిజన్) డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగింపుకు మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ,,సర్వేపల్లి ఎమ్మేల్యే సోమిరెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత  ప్రభుత్వం చెత్త పై పన్ను విధించి చెత్త ప్రభుత్వంగా మిగిలిపోయిందని, ప్రజలపై చెత్త పన్ను విధించి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మిగిల్చి  పోయిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటికే 3o లక్షల టన్నుల చెత్త తొలగించడం జరిగిందని,మిగిలిన 55 లక్షల టన్నుల చేతను అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు.రానున్న ఆరు నెలల్లో డంపింగ్ యార్డ్ లో పూర్తిస్థాయి చెత్త తొలగించి గ్రీనరీని ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో స్వచ్ఛభారత్ కింద 2800 కోట్లు నిధులు రాష్ట్రానికి మంజూరైన మ్యాచింగ్ గ్రాంట్స్ కట్టక పోవడంతో నిర్లక్ష్యం చేసిందన్నారు. రోడ్లను శుభ్రపరిచేందుకు 72 స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని, త్వరలో యంత్రాలతో రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టనున్నామని మంత్రి తెలిపారు.

యార్డ్ తొలగింపుకు 23.88 కోట్లు:- తమ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఉండడం మూలంగా ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారన్నారని,, ఇదే విషయమై మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ తొలగింపుకు  23.88 కోట్లతో చర్యలు చేపట్టారని సోమిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి,మునిసిపల్ కమీషనర్ సూర్యతేజ,పలువురు నాయకులు ,అధికారులు  స్థానికులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *