కనుపూరు చెరువులో కేసులో పోలీసుల కస్టడీలోకి కాకాణి
నెల్లూరు: కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో నిందితుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణ నిమిత్తం పోలీసులు గురువారం ఉదయం జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు..వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించనున్నారు..ఈ కేసుకు సంబంధించి బుధవారం వెంకటాచలం పోలీసులు 30 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం..కాకాణికి రాజకీయంగా, వ్యాపారపరంగా సన్నిహితంగా ఉండే వ్యక్తుల వివరాలు, వ్యాపార సంస్థలు వివరాల గురించి పోలీసులు ప్రశ్నించారు..ఈ కేసులో A2గా ఉన్న మందల వెంకట శేషయ్య గురించి, ఆయనతో ఉన్న సంబంధాలు, అల్లంపాటి నిరంజన్ రెడ్డితో ఉన్న వ్యాపార లావాదేవీల విషయంలో మాజీ మంత్రిపై పోలీసులు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తొంది..న్యాయవాది ఎదుట కాకాణిని పోలీసులు విచారిస్తున్నారు.. సాయంత్రం ఐదు గంటలకు విచారణ ముగిసిన అనంతరం తిరిగి మాజీ మంత్రి కాకాణిని జిల్లా జైలుకు తరలించనున్నారు.