DISTRICTS

నగరపాలక సంస్థ నూతన హెల్త్ ఆఫీసర్ గా దినేష్

నెల్లూరు: నగరపాలక సంస్థ నూతన హెల్త్ ఆఫీసర్ గా దినేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడున్న హెల్త్ ఆఫీసర్ కనకాద్రిని ఆయన మాతృ శాఖకు బదిలీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా వాల్లేటి వారి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా  పనిచేస్తున్న దినేష్ ను నెల్లూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ వైవో.నందన్ ను ఛాంబర్ లో కలిసి జాయినింగ్ రిపోర్ట్ ను అందజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *