రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించిన పెద్దిరెడ్డి.రామచంద్రారెడ్డి ఒక అడవి దొంగ ? నాగబాబు
ప్రతీ వాడిని మెడ పట్టి లోపలికి తోస్తాం..
అమరావతి: రైతులకు వ్యవసాయ మీటర్ల పేరుతో రూ.1500 కోట్లు ప్రక్కదారి పట్టించారు..నిజమా కాదా ? మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపార భాగస్వామి అయిన బాలినేని.శ్రీనివాసులరెడ్డి వాటాను లాక్కున్నది నిజమా కాదా ? గతంలో రాజశేఖర్ రెడ్డితో కలసి 50-50 భాగస్వామ్యంతో లిక్కర వ్యాపారం చేసింది నిజమా కాదా ? అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన ప్రశ్నలు సంధించారు.. ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల దగ్గర “జనంలోకి జనసేన” కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంలో నాగబాబు వైసీపీ నిప్పులు చెరిగారు..
వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి ఎవరెవరి ఆస్తులైతే కబ్జా చేశారో అన్నీ బైటకి తీస్తాం.. కూటమి కార్యకర్తలకు అసంతృప్తి ఉంది వీరి మీద చర్యలు తీసుకోవట్లేదు అని, అందరి మీద చర్యలు తీసుకుంటాం, మనం వచ్చి 8 నెలలే అయ్యింది.. ముందు ప్రజల బాగోగులు చూసుకోడం ముఖ్యం, సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి, జగన్ రెడ్డి,, ద్వారంపూడితో సహా అందరిపైనా చర్యలు తీసుకుంటాం,, ఎవ్వడు చట్టం నుంచి తప్పించుకోలేడు, ప్రతీ వాడిని మెడ పట్టి లోపలికి తోస్తాం అని అన్నారు..అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని పెద్దిరెడ్డి. రామచంద్రారెడ్డి ఒక అడవి దొంగ ? అని ఆరోపించారు.. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ? విమర్శించారు.. అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు.