AP&TGCRIME

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం-23 మంది మృతి

అమరావతి: కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 23 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి పంటపొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. అడబాల వీరబాబు అనే వ్యక్తి పొలాల్లో చదును చేసి బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరిపొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో ఈ బాణసంచా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోజూ 25 నుంచి 30 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇవాళ కూడా అధిక సంఖ్యలో మహిళలు బాణసంచా తయారీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం తర్వాత బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. దాదాపు గంటకుపైగా పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిమితికి మించి బాణసంచా తయారుచేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.                                                                                                                                      పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు: పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంతగా శబ్ధం విన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురయ్యారు. ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునే సరికి చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.

మృతి చెందిన వారు:- మృతుల్లో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు గుర్తించారు. అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నాని మృతి చెందారు.

ఘటనా స్థలం వద్ద బీతావహంగా పరిస్థితి: పేలుళ్ల ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొలాల మధ్య బాణసంచా తయారీ కేంద్రం ఉండటం అక్కడికి ఫైర్‌ ఇంజన్‌, అంబులెన్స్‌ వెళ్లే మార్గం కూడా లేదు. చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడి బాధితులను అతికష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద స్థలికి ముఖ్యమంత్రి:- జిల్లా కలెక్టర్ వాహనంలో వేట్లపాలెం చేరుకున్న సీఎం చంద్రబాబు,,బాణసంచా ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాము. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని  హామీ ఇచ్చారు.

ఉపముఖ్యమంత్రి:- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ పేలుడు ఘటనాస్థలిని ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.ప్రభుత్వం అండగా వుంటుందని, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *