AP&TGMOVIESOTHERS

ఏ.పిలొ చలన చిత్ర పరిశ్రమకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు-మంత్రి కందుల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృ ద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,,అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు..అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రితో సినీ నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు..

కార్మికుల సమ్మెపై చర్చించలేదు:- మంత్రి దుర్గేష్ తో సమావేశం ముగిసిన అనంతరం నిర్మాతలు రవి శంకర్, నాగవంశీ మాట్లాడుతూ,, కార్మికుల సమస్యల గురించి మంత్రి కందుల రమేష్ తో జరిగిన సమవేశంలో చర్చకు రాలేదన్నారు..ఈ విషయం ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ చూసుకుంటుందని తెలిపారు.. చిన్న బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు ఇవ్వాలనేది అందరి కోరిక అన్నారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరామని తెలిపారు..త్వరలో సీఎం, డిప్యూటీ సీఎంతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చినట్టు తెలిపారు..స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణానికి తము సిద్దంగా వున్నామనే విషయం మంత్రికి తెలియచేయడం జరిగిందన్నారు.

నంది అవార్డులు:- సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడుతూ,, రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్దిపై సినీ నిర్మాతలు చర్చించారని,,ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సమావేశానికి అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారని తెలిపారు.. ఏపీలో సినీ పాలసీ అభివృద్దికి పాలసీ తీసుకురావాలని అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొనే సమస్యలను, చర్చించాల్సిన అంశాలను ప్రాథమికంగా నా దృష్టికి తెచ్చారని అన్నారు.. సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు నంది అవార్డులు ఇవ్వాలని కోరారని అయితే ఈ సంవత్సరం నంది అవార్డులను నటీ,నటులకు బహుకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు.. నంది అవార్డులు ఏ ప్రాతిపదికన ఇవ్వాలో నిర్మాతల మండలితో చర్చించి రావాలని,,నంది అవార్డులు ఎలా ఇస్తే బాగుంటుందో చర్చించి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించడం జరిగిందన్నారు.. తెలుగు రాష్ట్రాలకు కలసి నంది అవార్డులు ఇచ్చే ప్రతిపాదనలు ఆలోచిస్తున్నమన్నారు..త్వరలో సినిమా రంగ అభివృద్దికి ప్రత్యేక పాలసీ తీసుకు రావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని,, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలకు ప్రోత్సహించేలా పాలసీ ఉంటుందని వెల్లడించారు..రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చెందేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు పాలసీలో ఉంటాయన్నారు.. సినీ కార్మికుల ఆందోళన అంశం తమ మధ్య చర్చకు రాలేదు అని తెలిపారు.

నిర్మాతల మండలి:- బివిఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కెఎల్ నారాయణ, భరత్(ఛాంబర్ ప్రెసిడెంట్), నాగవంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీవాసు, స్వప్నదత్, యూవీ వంశీ, చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి.. మరికొంతమంది నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *