AP&TG

హైదరాబాద్​లో వడగండ్ల వాన-నేలకొరిగిన భారీ వృక్షం

హైదరాబాద్​: హైదరాబాద్​లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వాన :-  సికింద్రాబాద్ బోయిన్ పల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్‌టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి పరిసర ప్రాంతాలలో వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, మారేడుపల్లి, తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు

నేలకొరిగిన భారీ వృక్షం:- చింతల్, పద్మనగర్​లో గాలి వాన ధాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు ధాటికి రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రహదారులపైకి వాన నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సంభవిస్తున్నాయని, వచ్చే కొన్ని గంటలు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *