అన్యమతం అచరించే ఉద్యోగులకు రెకమండేషన్ వుంటే టీటీడీలో హ్యపీగా ఉద్యోగం చేసుకోచ్చు?
ఈ.ఓ,,విజిలెన్స్ అధికారులు…?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం అంత ఉత్తుత్తిదే….
అమరావతి: టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను గుర్తించిన అధికారులు వారిని టీటీడీ నుంచి ఇతర శాఖలకు బదలీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు..అయితే ఈ 18 మంది ఉద్యోగుల్లో వెంకటేశ్వర అయుర్వేద కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు(బార్య,భర్త) ఉద్యోగులకు మాత్రం (రెకమండెషన్) మినహయింపు లభించడంతో,,వీరిద్దరు పేర్లు సదరు లిస్టులో నుంచి మాయం అయ్యాయి???..గత ప్రభుత్వం హాయంలో భార్య,భర్తలు… (Dec 25, 2019) మాజీ సీ.ఎంతో పాటు Christmas సందర్బంలో పులివెందుల CSI Churchలో గంటల కొద్ది ప్రార్ధనల్లో,, అన్యమత కార్యక్రామల్లో పాల్గొన్న వీడియోలు టీవీ చానల్స్ లో,,జాతీయస్థాయి పత్రికల్లో వార్తలు వచ్చాయి..
టీటీడీలో ఉద్యోగం పొందే సమయంలో సదరు ఉద్యోగి, హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేస్తారు..నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం, ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం ఈ పద్దతి అనుసరించాలి.. ఎండోమెంట్ యాక్ట్ ను ఉల్లఘించిన ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుంది..కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన అనంతరం,,( TV5 Channel అధినేత) బీ.ఆర్ నాయుడు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.. ఆన్యమతస్థుల విషయంలో ముఖ్యమంత్రి సీరియస్ గా వుండడంతో,, వెంటనే చర్యలు ప్రారంభం అయ్యాయి.. ఆన్యమతస్థుల జాబితలో 18 మందిని గుర్తించి చర్యలు ప్రారంభించారు..అయితే భార్య,భర్తల పేర్లను మినహయించి,,మిగిలిన వారిపై చర్యలు అంటూ విజిలెన్స్ అధికారులు,,ఇ.ఓలు ప్రకటనలు ప్రారంభించారు.. ఇందుకు కారణం… తిరుపతిలోని బీజెపీ నేత ? రెకమండెషన్ పనిచేసిందని టీటీడీలో క్రింద్ర స్థాయిలో ఉద్యోగులు మండిపడుతున్నారు..మిగిలిన 16 మంది ఉద్యోగులకు కూడా మినహయింపు ఇస్తే సరిపోతుంది కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు..
సనాతన ధర్మంకు రక్షణగా వుంటు వస్తున్న డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వచ్చిందా? అలాగే సీ.ఎం చంద్రబాబు వరకు ఈ విషయం వెళ్లిందా ?,,TV5 Channel అధినేత బీ.ఆర్ నాయుడు,,ఈ విషయంను విస్మరించారా? అంటూ ప్రశ్నలు మొదలు అయ్యాయి..ఈలాంటి రెకమెండేషన్ వల్లే గతంలో టీటీడీ భ్రష్టు పట్టింది? అయిన నాయకుల్లో ఎలాంటి మార్పు రాలేదు? హిందువుల దేవాయల్లో మాత్రమే ఇలాంటి దుస్థితి వుంటుందా?…మరి లిస్టులో నుంచి మాయం అయిన పేర్లకు సమాధానం ఎవరు చెపుతారు?? సామాన్య భక్తుడి ప్రశ్నకు సమాధానం వస్తుందా? వేచి చూడాలి మరి???
గతంలో టీటీడీ తీర్మానలు…ప్రకటనలకే పరిమితం…?
(హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే…టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు అదేశం..
18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలో చేయాలని ఉత్తర్వులు..)