AP&TGDEVOTIONALOTHERS

రికార్డు సృష్టించిన కీర్తి రిచ్‌మండ్ లడ్డూ వేలం పాట-రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ

బాలాపూర్‌ లడ్డూ 30 లక్షల వెయ్యి రూపాయలు..

హైదరాబాద్: వినాయక చవితి పండుగ సందర్బంగా నిర్వహించే లడ్డూ వేలానికి ఇప్పటి వరకు భాగ్యనగరానికి ఒక  ప్రత్యేకత ఉంది.. గణేష్ నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూని భక్తులు విశేషంగా భావిస్తారు..లడ్డూను దక్కించుకోవడానికి ఎంతైనా వెచ్చిస్తుంటారు..ఇందులో భాగంగా హైదరాబాద్ బండ్లగూడజాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది..వేలం పాటలో ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది..గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో రూ.1.20 కోట్లకు లడ్డూను దక్కించుకోగా, ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ ఈసారి దానిని మించి ధర పలకింది.. గత సంవత్సరం ఇక్కడ లడ్డూ ధర రూ.60.80లక్షలు పలికింది..కీర్తి రిచ్​మండ్​ విల్లాలో 11 సంవత్సరాలుగా గణేష్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు..పదకొండో రోజున నిమజ్జనం చేస్తారు.. లడ్డూ వేలంపాటలో విల్లాలో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు..లడ్డూ ఎవరికి దక్కినా అందరూ కలిసి సేవా కార్యాక్రమాల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు..ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించారు.

బాలాపూర్‌:- లడ్డూ గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు కొలను శంకర్‌ రెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు..1116 రూపాయలతో ప్రారంభమైన వేలం పాట పోటీపై పెరుగుతూ రూ.30 లక్షల వద్దకు చేరుకుంది.. తరువాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్‌ రెడ్డికే బాలాపూర్‌ లడ్డూ దక్కింది..బాలాపూర్‌లో గణేషుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెడుతుంటారు..బాలాపూర్‌ లడ్డూ బరువు 21 కిలోలు..1980లో మొదలైన ఈ సంప్రదాయాన్ని నిర్వాహకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు..లడ్డూ వేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు..ఆ సమయంలో లడ్డూ ధర రూ.450లకు వేలం పాట జరిగింది..అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేలం పాట పెరుగుతూ రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది..గత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ.27లక్షలకు పెరిగింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *