కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్,డిజిటర్ మార్కెటింగ్ ఎక్స్పో టెక్ సెమినార్
విశాఖపట్నం: విశాఖలో మూడు రోజుపాటు నిర్వహిస్తున్న కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ 4వ సెమినార్ కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్,డిజిటర్ మార్కెటింగ్ ప్రతినిధులు, డిజిటల్ సాంకేతిక రంగ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సెమినార్ నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్బంగా డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పాల్గొని కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. ఈ నెల 27,28,29 తేదిలలో లాసన్స్ బే కాలనీ గాదిరాజు ప్యాలస్ లో కనెక్ట్ ఏపీ పేరిట టెక్ ఎక్స్పో ఏర్పాటు చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ ఎక్స్పో లో ఇంటర్నెట్ ప్రొవైడర్స్, కేబుల్ టీవీ ఆపరేటర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులకు సంభందించిన అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందిన అన్ని రకాల డ్రోన్స్, సీసీ టీవీస్, స్ప్లిసింగ్ మిషన్స్ ఇతర పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు.ఈ ఎక్స్పో గత 4 సంవత్సరాలుగా తాము కొనసాగిస్తున్నమన్నారు. మారుతున్నా టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇది ఒక టెక్నాలజీ వేదికగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రపంచదేశాలలో మారుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సమందించిన ప్రతీ ఒక్క పరికరం వినియోగదారులకు ఈ ఎక్స్పో లో దొరికే విధంగా అన్ని ప్రముఖ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వాహస్తున్న ఈ ఎక్స్పో ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో కేబుల్ ఆపరేటర్లు సుభద్రరాజు,గుంటూరు ప్రసాద్, చింతాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.