భూగర్భ డ్రైనేజీ కి కేవలం ఒక రూపాయి చెల్లిస్తే చాలు-మంత్రి నారాయణ
నెల్లూరు: నగరం పరిధిలో వివిధ పార్కులు,,పాఠశాలల్లో జరుగుతున్న జిమ్ ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్స్ తదితర పనుల పురోగతిని మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు..ఆదివారం ఉదయం పార్కులలో ఏర్పాటు చేస్తున్న ఆటస్థలాలు అనువుగా ఉన్న పాఠశాలల్లో బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తామన్నారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ ఏర్పాటుకు గతంలో ఐదు వేలుగా ఫీజు వసూలు చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఒక రూపాయికే కనెక్షన్ ను అందిస్తున్నామన్నారు. అయితే వారి ఇంటిలోని పైప్లైన్ ఖర్చు వారే భరించాల్సి ఉంటుందన్నారు. దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుతోనే సాధ్యమన్నారు.