వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి-మంత్రి లోకేష్
‘మన మిత్ర-ప్రజల చేతిలో ప్రభుత్వం’’..
అమరావతి: ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ ప్రజలు ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి ‘‘మన మిత్ర-ప్రజల చేతిలో ప్రభుత్వం’’ అనే వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించనుంది.. ఐ.టీ శాఖ మంత్రి నారా.లోకేశ్ నేడు అధికారికంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు..
స్కాన్ చేస్తే అందుబాటులోకి సమాచారం:- 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా, 36 ప్రభుత్వ డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం 161 సేవలు అందిస్తుందన్నారు.. రెండో విడతలో వాట్సాప్‍లో 360 సేవలను అందుబాటులో ఉంచుతామని,, రెండో విడత వాట్సాప్ గవర్నెన్స్ కు AIను కూడా జత చేసి ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుందని దింతో వాట్సాప్ గవర్నెన్స్ తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదని మంత్రి వెల్లడించారు..
నకిలీ పత్రాలకు అడ్డుకట్ట:- ఈ నెంబరుకు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) కేటాయించినట్లు చెప్పారు..ప్రభుత్వం అందచేసే సర్టిఫికెట్ల మీద క్యూ ఆర్ కోడ్‌లతో జారీ చేస్తామని,, వాటిని స్కాన్ చేస్తే వాటి వివరాలు ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అవుతాయని,, నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదని మంత్రి స్పష్టం చేశారు..రెవెన్యూ,, మున్సిపల్,, ఎండోమెంట్ సేవలను వాట్సాప్‌లో అందజేస్తామన్నారు.. టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవలను వాట్సాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు..
సూచనలు ఖచ్చితంగా అనుసరించాలి:- వాట్సాప్‌లో అందించే పౌర సేవలకు సంబంధించి (ఫెస్ బుక్) మెటా నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావు.
ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ చేసిన తర్వాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
వాట్సాప్ ద్వారా అందజేసే సేవల్లో పౌరుల సమాచారాన్ని మెటా(ఫెస్ బుక్) స్టోర్ చేయదు.
మెటా(ఫెస్ బుక్) డేటా సర్వర్లను ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణ,, సంరక్షణలోనే ఏర్పాటు చేస్తారు.
వ్యక్తిగత వివరాల గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
రాష్ట్రానికి సంబంధించిన సేవలను వాట్సాప్ మనమిత్రలో జత చేస్తారు.
పేర్ల మార్పులు తదితర సేవల అంశంలో చట్టపరంగా ఉన్న అంశాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు.
కొన్ని రకాల సేవలను తక్కువ సమయంలో అందిస్తారు.
వాట్సాప్ పౌర సేవల ద్వారా ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టారు.
గతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు.
వాట్సాప్‌లో అందించే పౌర సేవలపై ప్రజలకు ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి అవకాశం కల్పించలేదు.