AP&TGCRIME

రైల్వేట్రాక్ పై 7 కిలోమీటర్లు కారుతో హల్ చెల్ చేసిన యువతి

పబ్లిసిటీ కోసంమేనా ?

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగులపల్లి-శంకర్‌పల్లి మధ్య దాదాపు 7 కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ఒక యువతి కారు డ్రైవ్ చేసిన సంఘటన గురువార ఉదయం చోటు చేసుకుంది..సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం ఇటీవల కాలంలో కొంత మంది యువతి,యువకులు బరి తెగిస్తున్నారు..వీరి చేష్టల వల్ల సామాన్యులు ఇబ్బందు పడాల్సి వస్తొంది..విషయంలోకి వెళ్లితే….. ఉత్తరప్రదేశ్,,లక్నోకు చెందిన రవికా సోనికా(26) హైదరాబాద్‌లోని ఒక సంస్థలో  సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తుందన్నారు..ఇటీవల ఆమెను సదరు కంపెనీ విధుల నుంచి తొలగించారని తెలిసింది.?

ఈమె గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారును డ్రైవ్ చేయడం గమనించిన నాగులపల్లి గ్రామస్థులు,,యువతి నడుపుతున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు..అయితే రవికా సోనికా కారును అపకుండా,రైలు పట్టాలపై వేగంగా నడుపుతూ ఆమె ముందుకు వెళ్లిపోయింది.. దీంతో గ్రామస్థులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు..సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన రైల్వే అధికారులు,,స్థానికులతో కలసి అమెను బలవంతంగా కారులో నుంచి దించి వేసేందుకు ప్రయత్నించగా,,వారిని బూతులు తిడుతు కారులో నుంచి దిగేందుకు నిరాకరించింది..ఎట్టకేలకు రైల్వే సిబ్బంది,,స్థానికులు కలసి అమెను కారు నుంచి దింపివేశారు..

సదరు యువతి తొలుత కారును నెమ్మదిగా రైలు పట్టాలపై నడిపిస్తుండగా ఆమె స్నేహితుడు వీడియో తీస్తున్నడని స్థానికులు తెలిపారు..ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి..కారు రైల్వే ట్రాక్‌పై ఉండటంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న పలు రైళ్లను అధికారు నిలిపివేశారు..దింతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు అధికారులు తెలిపారు..ఈమె కేసు నమోదు చేసిన అధికారులు,,అమెను ఆసుపత్రికి తరలించి పరిక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం..(సదరు యువతి మద్యం మత్తులో వున్నట్లు స్థానికులు వ్యాఖ్యనిస్తున్నారు.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *