మార్కాపురంజిల్లాలో 45.7°C-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైనట్లు పేర్కొన్నారు. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. మంగళవారం (28-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం మార్కాపురం(జి) కంభంలో 45.7°C, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు(జి) కొమ్మిపాడులో 45.1°C, అమరావతిలో 44.2°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 44.8°C, తిరుపతి(జి) బేస్తపల్లి, వైఎస్సార్ కడప(జి) వీరబల్లిలో 44.2°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44°C, అన్నమయ్య(జి) నూలివీడులో 43.1, చిత్తూరు(జి) తవణంపల్లెలో 43°C, కర్నూలు(జి) కల్లూరు, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు 42.7°C, కాకినాడ(జి) కరపలో 42.4°C, శ్రీసత్యసాయి(జి) ముడిగుబ్బ 42.3°C, మన్యం(జి) బూర్జ, అనంతపురంలో 42.2°C, శ్రీకాకుళం(జి) కొత్తూరు, విజయనగరం(జి) రాజాంలో 41.7°C, బాపట్ల(జి) మార్టూరులో 41.6°C, అనకాపల్లి(జి) దేవరపల్లెలో 41.5డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

