నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ నిడివి 83.64 కి.మీ-కలెక్టర్
నెల్లూరు: లేబురు-బిట్-2 నుండి ప్రారంభమై రాజుపాలెం జంక్షన్ వరకు సుమారు 83.64 కి.మీ. మేర నిర్మించ తలపట్టిన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో నేషనల్ హై వేస్(జాతీయ రహ దారులు), ట్రాఫిక్ పోలీస్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, సంబంధిత శాఖలు సమన్వయంతో కూలకుషంగా చర్చించుకొని ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణములోని తిక్కన భవనములో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుపై సూచనలు, సలహాల కోసం ప్రాధమిక తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ నాలుగు నియోజిక వర్గాలులో కోవూరు నియోజిక వర్గములో 41.44 కి,మీం సర్వేపల్లి నియోజిక వర్గములో 20.94 కి.మీ., నెల్లూరు రూరల్ నియోజిక వర్గములో 19.64 కి.మీ.,ఆత్మకూరు నియోజికవర్గములో 1.02 కి.మీ వెరసి 83.64 కి.మీ మేర సుమారు 1930 కోట్ల రూపాయలతో ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజులు, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణ, వంటి అంశములపై సంబంధిత శాఖల వారు ఒకరి కొకరు చర్చించి తుది నివేదిక రూపొందించాలన్నారు. అదే విధంగా 2023 సంవత్సరములో ప్రతిపాదన ఉన్నదని నాటికి నేటికి మార్పులు ఉంటాయని, వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబందిత వారితో చర్చించాలన్నారు. నియోజకవర్గ శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులతో వివరంగా చర్చించాలన్నారు. సమగ్ర నివేదిక అనంతరం అవసరమైన నిదులకై ప్రభుత్వాలకు నివేదించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో ఎమ్మేల్యే ప్రశాంతిరెడ్డి,నూడా ఛైర్మన్ శ్రీనివాసులరెడ్డిరూప్ కుమార్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

