పుట్టిన రోజు సందర్బంగా కుటుంబసభ్యులతో కలిసి శీవారిని దర్శించుకున్న చిరంజీవి
అమరావతి: తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గురువారం తన పుట్టిన రోజు కావడంతో తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బుధవారం తిరుమలకు వచ్చారు.. గురువారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాతసేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దగ్గరుండి చిరంజీవికి శ్రీవారి దర్శనం చేయించారు..చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి కూడా తిరుమలకు చేరుకున్నారు. అంతకుముందు సాయంత్రం కుమార్తె శ్రీజ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో వేకువజామున జరిగే సుప్రభాతసేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ‘‘నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు.. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు ఎన్నో,, కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి.. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు.. అభ్యర్థిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో అని లేఖలో పేర్కొన్నారు.