క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది విధులను పరిశీలించిన కలెక్టర్
నెల్లూరు: ఇంటి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరణలో సచివాలయ సానిటరీ సిబ్బంది ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శనివారం స్థానిక పాత మునిసిపల్ కార్యాలయములో దోర్నాల వీధి(41/1), మేక్లీన్స్ రోడ్ ( 42/1), చిన్నబజర్(48/3) మరియు టెంకాయలవీది ( 52/3) సచివాలయ సిబ్బందితో హౌస్ హోల్డ్ సర్వే, సిబ్బంది విధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయములో అన్ని రిజిస్టర్లు విధిగా ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయ నియమ నిబందనల ప్రకారం నిర్వహిచించి, పాటించాలని అన్నారు. ఈ సందర్బంగా సిబ్బంది నిర్వహిస్తున్న పలు రిజిస్టర్లు ను పరిశీలించారు. సమాచార హక్కు చట్టం- 2005 అమలుపై రిజిస్టర్ ను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇంటింటి సర్వే ఎలా చేస్తున్నారని సంబందిత సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్లానింగ్ సెక్రెటరి, ఎమినిటీస్ సెక్రటరీలు, సానిటేషన్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు-వెల్ఫేర్ సెక్రటరీలతో విడివిడిగా చర్చించి విషయాలు తెలుసుకున్నారు. ఎమినిటీస్ సిబ్బందితో మాట్లాడుతూ రోజూ మున్సిపల్ వాటర్ ఎన్ని సార్లు , ఎక్కడి నుండి అందిస్తున్నారు, ట్యాంకుల ద్వారా ఎక్కడైనా సరఫరా చేస్తున్నారా వివవరాలు సేకరించారు. తల్లికి వందన అర్హులైన అందరికి అందినదా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఎడ్యుకేషన్ సెక్రటరీలను అడిగితెలుసుకున్నారు. ప్లానింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ శాఖతో సమనవ్య పరచుకొని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమములో నగరపాలక సంస్థ కమీషనర్ నందన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహాణ అధికారి శ్రీధర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి నరసింహులు, గ్రామా వార్డు సచివాలయ అడిషనల్ కమీషనర్ హిమ బిందు తదితరులు పాల్గొన్నారు…

